ఏయ్ ! నువ్వేనా పిన్నీ అంటే ? హఠాత్తుగా రెండో స్వరం అధికారంగా వినిపించింది. బాబు మెత్తటి అరచేతిని పరిశీలిస్తున్నా ఆన్నపూర్ణ చివ్వున తలెత్తి చూసింది. గుమ్మంలో రెండు జడలతో జడలకి తెల్లటి రిబ్బన్లతో , తెల్లటి గౌనుతో అయిదారు సంవత్సరాల అమ్మాయి నిలబడి వుంది.
నీ పేరేమిటి ? చేతులు కట్టుకుని ఆరిందాలా అడిగింది. ఆన్నపూర్ణ ఇంకా అలాగే చూస్తోంది.
మా ఇంట్లో ఉండిపోతావా ? లేక ఊరు చూసి వెళ్ళిపోతావా ? అంది మళ్ళి. సమాధానం ఏం చెప్పాలో తెలియక ఆన్నపూర్ణ విస్మయంగా చూడసాగింది. "నువ్వు నా జట్టా? వాడి జట్టా ? ఎవరి పార్టీయో ఇప్పుడే తేల్చేయమన్నట్లు నిలదీసింది. ఆన్నపూర్ణ పెదవులు క్రమంగా చిరునవ్వులు విచ్చుకున్నాయి. చిన్ననాడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న ఆన్నపూర్ణ పిన్నమ్మ దగ్గర పెరుగుతుంది. ఆన్నపూర్ణ నోరు లేని పిల్ల. చాకిరీ తప్ప ఇంకేమి ఎరగదు. వెయ్యి రూపాయలు తీసుకుని ఆన్నపూర్ణ ను అనంత్ కిచ్చి చేయటానికి ఒప్పుకుంటుంది పిన్నతల్లి సుందరమ్మ. అనంత్ రెండో పెళ్ళినాడు ఇద్దరు పిల్లలు కూడా , భార్య పోయిన దిగులులో అన్నపూర్ణని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాడు. తల్లి బలవంతం మీద చేసుకున్న పెళ్లిది .
అతడికి దగ్గరవుదామని ఆన్నపూర్ణ చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతుంటాయి. అతని చుటూ భయంకరమైన గతం కోట గోడకి మల్లె గట్టిపడి పోయి ఉంది. ఆ దుర్భేద్యమైన గోడని చేదించ గలదా ఆ మూగపిల్ల ? యద్దనపూడి సులోచన రాణి అందించే అపురూపమైన నవల - ఆరాధన