ఆ కౌగిలిలో స్త్రీపురుషులు యేకమైనప్పుడు సహజంగా కలిగే ఉద్రేకంగాని,ప్రేమికులు తొలిసారిగా కలిసినప్పుడు కలిగే తొందరపాటు గాని లేవు. వయస్సు గడిచిన జీవితంలో అనేక కష్టసుఖాలకి గురియై,చరమదశలో మనశ్శాంతిని ఇచ్చే వ్యక్తికోసం వెతుక్కుంటూ ప్రపంచం చెరో అంచునుంచి బయలుదేరి ప్రయాణం చేసి అనుకున్న వ్యక్తికోసం వెతికి వెతికి వేసారిపోయి నిరాశతో నిట్టూర్పు విడవబోయ సమయంలో హఠాత్తుగా కావాలన్న మనిషి కనిపిస్తే వెంటనే ఆనందం పట్టలేక తృప్తితో ఒకరిని ఒకరు హత్తుకుపోయినట్టుగా వుంది.
ఇద్దరూ అనిర్వచనీయమైన అనుభూతి పొందుతున్నట్లుగా కళ్ళు మూసుకున్నారు.